
వాస్తవం తొంది. ఎదమైనా ఇలాం అధ్యయనం, విస్తృతమై రూపం దాల్చాకే అమల్లో, బస్తే అభిప్రాయపడుతున్నారు పలు ప్రముఖులు, సామాజిక కార్యక ఇడ్లీ, దోశెల కోసం మినప్పప్పును మిక్సీలో వేస్తే పోషకాలు నశిస్తాయా? తప్పనిసరిగా 22 వెట్ గ్రైండర్ లో రుబ్బాల్సిందేనా?
అపోహ
వాస్తవం
ఇడ్లీ, దోశెల కోసం మినప్పప్పును మిక్సీలో వేస్తే పోషకాలు నశిస్తాయా? తప్పనిసరిగా వెట్ గ్రైండర్ లో రుబ్బాల్సిందేనా?
సుజాత స్టీఫెన్ ఆర్.డి.
న్యూట్రిషనిస్ట్
ఇడ్లీ, దోశెల రుచి మంత్రం పిండిరుబ్బడంలోనే ఉంట దని పెద్దవాళ్లు చెప్పేమాటలో చాలా అర్థం ఉంది. రుచి మాత్రమే కాదు, ఇందులో ఆరోగ్యం కూడా దాగి ఉంది. అందుకే మిక్సీ కంటే వెట్ గ్రైండర్డ్తో తొలి ప్రాధాన్యం. ఎందుకంటే మిక్సీతో పోలిస్తే వెట్ గ్రైండర్లో పిండి రుబ్బేటప్పుడు అందులో ఎక్కువ వేడి ఉత్పన్నం కాదు. పిండి మెదిగే క్రమంలో వేడి ఎక్కువైతే ఆ దిను సుల్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ను కోల్పోతాం. మైక్రో ఆర్గానిజమ్స్ పిండి ఫెర్మెంటేషన్కు (పులిసి, పొంగి, గుల్లగా రావడం) దోహదం చేస్తాయి. ఫెర్మెంటేషన్ బాగా జరిగితే ఆ పిండిలో జీర్ణవ్యవస్థ పనితీరుకు అవసర మైన ప్రోబయాటిక్ మోతాదు పెరుగుతుంది.
వెట్ గ్రైండర్లో పిండి మెదిగే క్రమంలో గోరువెచ్చగా మారుతుంది. ఆ ఉష్ణోగ్రత వల్ల పప్పుల్లో ఉండే మినరల్స్, విటమిన్స్ చక్కగా రక్షింపచ బడతాయి. మెత్తగా రుబ్బడం కూడా మంచిదే. బాగా పొంగిన మెత్తని పిండితో చేసిన ఇడ్లీలలోని పోషకాలను దేహం సరిగ్గా పీల్చుకోగలుగు తుంది. రాయికీ రాయికీ మధ్య రాపిడి వల్ల పప్పులు, బియ్యం మెద గడం ఆరోగ్యకరమైన పద్ధతి. ఇది పదార్థంలోని రుచిని పెంచడమే కాకుండా పోషకాలను పరిరక్షించి పిండిని ఆరోగ్యకరమైన ఆహారంగా మారుస్తుంది..



